Saturday, May 4, 2024

మ‌లైకోటై వాలిబ‌న్ కి.. గుమ్మ‌డికాయ కొట్టేశారు

కొంత‌మంది న‌టుల‌ని చూస్తుంటే వ‌య‌సుతో వారికి ప‌నిలేదు..న‌ట‌నే జీవితంగా బ‌తుకుతుంటారు. అలాంటి వారిలో మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ కూడా ఒక‌ర‌ని చెప్పాలి. ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా మోహ‌న్ లాల్ విభిన్న పాత్ర‌ల‌ని పోషిస్తుంటారు. కాగా రీసెంట్ గా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం మ‌లైకోటై వాలిబ‌న్. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు విద్యుత్‌ జమ్వాల్‌, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్‌ సేత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యాక్స్ ల్యాబ్స్‌-సెంచురీ ఫిలిమ్స్‌ బ్యానర్లపై జాన్‌-మేరీ క్రియేటివ్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆరు పదుల వయస్సులోనూ మోహన్‌ లాల్‌ కండలు తిరిగిన దేహంతో గుబురు గడ్డం గెటప్‌లో.. భారీ తాడును లాగుతున్న స్టిల్‌ మూవీ లవర్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. కాగా మోహన్‌లాల్ అభిమానులకు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. మలైకోటై వాలిబన్ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా లొకేషన్‌లో తీసిన మోహన్‌ లాల్‌ బ్యాక్‌ లుక్‌ స్టిల్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు మొదలు కానున్నట్టు తెలియజేశారు మేకర్స్‌. ఈ అప్‌డేట్‌తో మలైకోటై వాలిబన్ ఇక అతి త్వరలోనే థియేటర్లలో సందడి చేయబోతున్నట్టు క్లారిటీ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement