Sunday, May 5, 2024

డైరెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ నిర్మాత‌గా ల‌వ్ యూ రామ్.. ట్రైల‌ర్ రిలీజ్

ఈ మ‌ధ్య కాలంలో చిన్న సినిమాలు మాంచి కంటెంట్ తో వ‌చ్చి దూసుకుపోతున్నాయి. కాగా ఇప్పుడో ప్రేమ‌క‌థా చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ల‌వ్ యూ రామ్ చిత్రం. వేద సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కథ ఇటు ఇండియాలోను .. అటు ఫారిన్ లోను నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. పెళ్లి విషయంలో అబ్బాయి సిద్ధాంతం వేరు .. అమ్మాయి అభిప్రాయం వేరు. నమ్మించడమే జీవితమనేది అతని పద్ధతి .. ప్రేమించడమే జీవితమనేది ఆమె తీరు. అలాంటి ఈ ఇద్దరి మధ్య నడిచే కథనే ఈ సినిమా. నమ్మించడం కంటే ప్రేమించడం ఈజీ’ అనేది ఈ ట్రైలర్ లో వినిపించిన లోతైన డైలాగ్. కొత్త ఆర్టిస్టులే ఎక్కువగా కనిపిస్తున్నారు .. హీరోయిన్ అపర్ణ జనార్దన్ అట .. బాగానే ఉంది. ‘సంతోషం’ .. మిస్టర్ పెర్ఫెక్ట్’ వంటి సినిమాలను తెరకెక్కించిన దశరథ్ ఈ సినిమాకి నిర్మాత. డివై చౌదరి దర్శకత్వం వహించాడు. ట్రైలర్ లో చూపించిన రెండు పాటలూ బాగున్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement