Saturday, May 4, 2024

హమ్మయ్య – కార్తీక దీపం ఆగిపోయే సమయం వచ్చింది !!

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. వారి అభిమానం ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ ను ఇతర సీరియల్స్ కాకుండా రియాలిటీ షోలు కూడా క్రాస్ చేయలేకపోయాయి. ఇక ఈ సీరియల్ వందల ఎపిసోడ్స్ ముగించుకుని ఇంకా నడుస్తుంది. మరోవైపు ఈ సీరియల్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా విపరీతంగా నడుస్తుంటాయి. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు వంటలక్కను కలిసేది ఎప్పుడు ? సీరియల్ ముగిసేది ఎప్పుడు ? అంటూ నెటిజన్లు మీమ్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు కార్తీకదీపం సీరియల్ కంచికి చేరినట్లే కనిపిస్తోంది. రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమో లో వంటలతో డాక్టర్ బాబు కలిసి మాట్లాడటం, వంటలక్క ఏడుస్తూ డాక్టర్ బాబు ని కౌగిలించుకోవడం ఉత్కంఠగా మారింది. ఇక కార్తీకదీపం సీరియల్ త్వరలోనే ముగింపు కార్డు పడనుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కాగా ఈ సీరియల్ నేటికి 1013 ఎపిసోడ్ లోకి ఎంటర్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement