Thursday, May 16, 2024

ఫిల్మ్‌చాంబర్‌ ఎదుట.. లైగర్ మూవీ బాధితుల రిలే దీక్ష

లైగ‌ర్ చిత్రంతో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్.
బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ కరణ్ జోహార్ ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్‌గా ఉండటంతో.. ఈ సినిమాకు బాలీవుడ్‌లో కూడా కావాల్సినంత స్పాన్ దక్కింది. కానీ రిజల్ట్స్ మాత్రం అనుకున్నట్లు రాలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఫిల్మ్.. తీవ్ర నష్టాలను చవిచూసింది. ఇటు ప్రొడ్యూసర్స్‌కు, అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలు తీసుకు వచ్చింది. లైగర్’ కోసం చేసిన అప్పులు, అగ్రిమెంట్లు దర్శకుడు పూరిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తమ నష్టాలు పూడ్చుకోవడనికి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సినిమా దర్శక నిర్మాత అయిన పూరిపై ఒత్తిడి తెస్తున్నారు.

గతంలో ఇదే ఇష్యూకు సంబంధించి పూరికి సంబంధించి ఓ వాయిస్ లీకయ్యింది. తాను డబ్బులు తిరిగి ఇవ్వవలసిన అవసరం లేకపోయినా బయ్యర్లు నష్టపోయారని తిరిగి ఇవ్వడానికి అంగీకరించానని, ఒక నెలలో ఇస్తానని చెప్పిన తర్వాత ఈ ఇష్యూ సెటిల్ అయిందనే అందరూ అనుకున్నారు.కానీ తాజాగా లైగర్‌ సినిమా నైజాం ఏరియా ఎగ్జిబిటర్ల ఆందోళనకు దిగారు. ఫిల్మ్‌చాంబర్‌ ఎదుట లైగర్‌ బాధితులు రిలే దీక్షకు పూనుకున్నారు. లైగర్‌ సినిమాతో భారీగా నష్టపోయామని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. తమను ఆదుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. గతంలో ధర్నా చేసిన వాళ్లకు కాకుండా నష్టపోయిన వాళ్లకు డబ్బులు ఇస్తానన్న పూరీ.. ఆ హామీనైనా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే.. సిట్యువేషన్ చేయి దాటినట్లే అనిపిస్తుంది. మరి దీనిపై పూరి క్యాంప్ నుంచి ఏం ఆన్సర్ వస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement