Monday, April 29, 2024

LEO | తెలుగు వరల్డ్ టీవీ ప్రీమియర్ కి రెడీ అయ్యిన “లియో”

దళపతి విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మూవీ “లియో”. విజయ్ కెరీర్ లోనే రికార్డు వసూళ్లు అందుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా మంచి నంబర్స్ సెట్ చేసింది. ఇక ఈ సినిమా అయితే ఫైనల్ గా తెలుగు వెర్షన్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ మరియు టైం ని ఫిక్స్ చేసుకుంది.

ఈ సినిమాని సన్ నెట్ వర్క్ వారు సొంతం చేసుకోగా జెమినీ టీవిలో ఈ జనవరి 15న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ప్రసారం కానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర కూడా విజయ్ సినిమాలకి మంచి రెస్పాన్స్ ఉంది. మరి లియో కి ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement