Saturday, May 4, 2024

నాని30 పై లేటెస్ట్ అప్డేట్.. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన మేక‌ర్స్

నేచురల్ స్టార్ నాని రీసెంట్ పాన్ ఇండియ‌న్ మూవీ దసరా.. బాక్సాఫీస్ వద్ద ఇంకా వ‌సూల్లు రాబ‌డుతూనే ఉంది. ఈ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 110 కోట్లకు పైగా వసూలు చేసి, నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీని త‌ర్వాత నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న కొత్త ప్రాజెక్ట్ నాని30లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. కాగా, ఇవ్వాల ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు మేక‌ర్స్. దానికి సంభందించి ఒక పోస్ట‌ర్ ని కూడా రిలీజ్ చేశారు మేక‌ర్స్. నాని కూడా త‌న సోష‌ల్ మీడియా ఎకౌంట్స్ లో ఈ అప్డేట‌క్ కి సంబందించిన పోస్ట‌ర్ ని అప్లోడ్ చేశారు. ఈ పోస్టర్ లో నానితో పాటు తన ఆన్-స్క్రీన్ కూతురుని చూడ‌వచ్చు.

ఈ అప్డేట్ ప్రకారం, నాని30 ఈ ఏడాది చివ‌రి నెల అంటే డిసెంబర్ 21న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తోంది. అంటే 2023 క్రిస్మస్ సీజన్‌లో వెంకటేష్ సైంధవ్‌తో ఈ చిత్రం క్లాష్ అవుతుంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాలో సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ ఈ సినిమాని నిర్మిస్తుండ‌గా.. హృదయం(మలయాళం) ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్చూజిక్ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement