Saturday, April 20, 2024

అంబేద్క‌ర్ విగ్ర‌హం అద్భుతం.. కేసీఆర్ కి శుభాకాంక్ష‌లు.. సీఎం స్టాలిన్

భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ జ‌యంతి రోజున 125అడుగుల కాంస్య విగ్ర‌హాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. కాగా త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ .. కేసీఆర్ కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు. అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని అటు బుద్ధ విగ్ర‌హానికి, ఇటు తెలంగాణ నూత‌న‌ స‌చివాల‌యానికి మ‌ధ్య ఏర్పాటు చేయ‌డం అద్భుత‌మ‌ని స్టాలిన్ ప్ర‌శంసించారు.
హుస్సేన్ సాగ‌ర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో క‌లిసి సీఎం కేసీఆర్ నిన్న ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి తెలంగాణ న‌లు మూల‌ల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల‌కు చెందిన ద‌ళిత నాయ‌కులు, ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement