Sunday, May 5, 2024

చరణ్ ….శంకర్ సినిమాలపై లేటెస్ట్ అప్డేట్ !!

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మేర అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఇప్పటికే ఈ సినిమా కథ కూడా రెడీ అయింది. ఇక ఈ సినిమాను ఆగస్టు నుండి మొదలు పెట్టబోతున్నారు. అయితే అందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా రెడీ చేస్తున్నారు.

ఆగస్టు 2వ వారం నుంచి చరణ్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారట. ప్రస్తుతం శంకర్ అయితే సెంటర్ నటీనటులను నటి నటులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారట. అలాగే ఈ సినిమాకి తమన్ సంగీతం అందించనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement