Sunday, May 19, 2024

Latest | ‘హాయ్ నాన్న’ శాటిలైట్ రైట్స్ వారికే.. !

దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని చేసిన మూవీ హాయ్ నాన్న. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ డీసెంట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తొంది. ఇక, ఈ మూవీలో జయరాం, శృతి హాసన్, ప్రియదర్శి, నాజర్ కీలక పాత్రలు పోషించగా హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.

ఈ పాన్ ఇండియన్ మూవీ శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ టెలివిజన్ సంస్థ జెమినీ టీవీ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీకి సాను వర్గేసే ఫోటోగ్రఫి అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement