Sunday, April 28, 2024

Nayanatara: పెద్ద‌రికం పాత్ర‌లో లేడీ సూప‌ర్ స్టార్

దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌ నయనతార వరుస సినిమాలు చేస్తోంది. జవాన్‌ సినిమా సక్సెస్‌ ఆమెకు బాలీవుడ్‌లో సైతం ఇమేజ్‌ తెచ్చిపెట్టింది. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయనకు పేరుంది. ఒకవైపు హీరోయిన్‌గా మరోవైపు లేడీ ఓరియంటెట్‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా కాస్త పెద్దరికంగా కనిపించే పాత్రలో నయన నటిస్తుందనే వార్త ఆసక్తి కలిగిస్తోంది.

ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఈ పాత్రను చేస్తున్నట్టు సమాచారం. ఇంతకీ పెద్దరికం పాత్రంటే మరీ ఎక్కువగా ఊహించుకోవద్దు. అది అక్క పాత్రట. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరంటే ప్రదీప్‌ రంగనాథన్‌ (లవ్‌ టుడే ఫేమ్‌). హీరోకి అక్క గా నయనతార కనిపి స్తుందట. ఇక ఈ సినిమాలో మరొక హీరోయిన్‌ నటి స్తుందని తెలిసింది. బాలీవు డ్‌ నటిని ఎంపికచేశారని సమా చారం. ఈ చిత్రం షూటింగ్‌ ఇదే నెల లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి ఎల్‌ఐసీ (లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ)గా టైటిల్‌ నిర్ణయించారు. ఎస్‌జే.సూర్య, యోగి బాబు కీలక పాత్ర ధారులు. నయనతార తన భర్త విఘ్నేష్‌ దర్శక త్వంలో ఇప్పటికే రెండు సినిమా లు (నానుమ్‌ రౌడీదాన్‌, కాత్తువా క్కుల రెండు కాదల్‌) చిత్రాల్లో నటించింది. తాజాగా రూపొందే చిత్రం మూ డవది. అంటే హ్యాట్ర్రిక్‌ చిత్రమన్నమాట.

Advertisement

తాజా వార్తలు

Advertisement