Sunday, April 28, 2024

విక్ర‌మ్ తంగ‌లాన్ రిలీజ్ డేట్ ఫిక్స్ ..

కోలీవుడ్ స్టార్ నటుడు విక్రమ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా తంగలాన్. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై మేకర్స్ నేడు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ చిత్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. మాళవిక మోహనన్ ఇందులో కథానాయిక గా నటిస్తుంది. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement