Tuesday, April 30, 2024

పాటలు అయ్యాయి – ఇప్పుడు ఫైట్ ‘ఆచార్య అప్డేట్ ‘

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. కాగా ఈ సినిమాలో చరణ్ కు సంబంధించి రెండు పాటలు ఓ ఫైట్ సీన్ ఉంటుందట. ఈ నేపథ్యంలోనే నిన్నమొన్నటి వరకు చరణ్ పూజా హెగ్డే కు సంబంధించిన పాటలను తెరకెక్కించిన కొరటాల… ఇప్పుడు యాక్షన్ సీన్ లో అడుగుపెట్టాడు.

రైన్ ఎఫెక్ట్ తో జరిగే ఈ ఫైట్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. ధర్మస్థలి విలేజ్ సెట్ లోనే ఈ ఫైట్ ఉండబోతోందట. కథలో కీలక ఘట్టంలో ఈ ఫైట్ సీన్ వస్తుందని తెలుస్తుంది. చరణ్ కు సోలో ఫైట్ కావటంతో ఈ ఫైట్ కు పాపులర్ స్టంట్ కొరియోగ్రాఫర్ లతో రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement