Sunday, April 28, 2024

ఎన్టీఆర్ ను మునుపెన్నడూ చూడని విధంగా కొరటాల చూపిస్తారా ?

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అయితే కొరటాల ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

అయితే ఈ ఖాళీ సమయాన్ని జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఉపయోగిస్తున్నారట కొరటాల. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ను ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా కొరటాల చూపించబోతున్నడట. ఎన్టీఆర్ ఇందులో ఒక పవర్ ఫుల్ విప్లవాత్మక నాయకుడి పాత్ర లో కనిపించనున్నారని తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ చిత్రం వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంత తో పాటు మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement