Saturday, May 4, 2024

విజ‌య్,స‌మంత‌ల ‘ఖుషి’ రిలీజ్ డేట్ పిక్స్ …

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఇటీ-వలే ఖుషి సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్‌ ఒకటిన విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా -టైలర్‌ను ఈ నెల 9న విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే ఖుషి నుంచి విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ అందించిన పాటలు ఆదరణ పొందుతున్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు- తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్‌ ఖేడేకర్‌, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్‌ వణ్నన్‌, రోహిణి, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శరణ్య ప్రదీప్‌ తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement