Sunday, May 5, 2024

నేడు రామ్ చ‌ర‌ణ్ చేతుల మీదుగా ‘కేజీఎఫ్-2’ ట్రైల‌ర్..

‘కెజిఎఫ్: చాప్టర్ 2’ వ‌చ్చే నెల (ఏప్రిల్)14న భారీ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతుంది, ఈ మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రమోషన్‌లను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు నిర్మాతలు. అందుకు వారు ఈ రోజు సాయంత్రం బెంగళూరులో అతిపెద్ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ప్ల‌న్ చేశారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చ‌ర‌ణ్‌కు దేశవ్యాప్తంగా మ‌రింత‌ పేరు వ‌చ్చింది. రిలీజ్ అయిన రోజు నుండి ఆ సినిమా భారీ వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది.

దాంతో పాటు ఈ రోజు చెర్రీ బ‌ర్త్ డే కావ‌డంతో.. కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా ట్రైల‌ర్ చ‌ర‌ణ్ చేతుల మీదుగా విడుద‌ల చేయించాల‌ని ‘కేజీఎఫ్-2స చిత్ర యూనిట్ నిర్ణ‌యించింది. కాగా, ఈ సినిమా త‌మిళ ట్రైల‌ర్ కూడా ఈ రోజు సాయంత్రం 6.40 గంట‌ల‌కే హీరో సూర్య చేతుల మీదుగా విడుద‌ల కానుంది. కన్నడ వెర్షన్‌ను స్టార్ శివరాజ్ కుమార్ అందించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement