Monday, May 6, 2024

కార్తికేయ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘బెదురులంక 2012’.. ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

RX100 ఫేమ్ కార్తికేయ నెక్ట్ ప్రాజెక్ట్ ‘బెదురులంక 2012’. పల్లెటూరి నేపథ్యంలో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయ బర్త్ డే ( సెప్టెంబర్ 29 ) రోజు ఈ సినిమా టైటిల్‌ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే, కొద్ది సేపటి క్రితం ఈ సిినిమా ప్రి లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇక ఈ నెల 30న 10.40 నిమిషాలకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఈ ప్రీలక్ పోస్టర్ లో మెన్షన్ చేశారు.

ఈ సినిమాలో కార్తికేయకు జంటగా ‘డీజే టిల్లు’ ఫేమ్, యంగ్ హీరోయిన్ నేహా శెట్టి నటిస్తున్నారు. అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement