Wednesday, May 1, 2024

Kantara 2 | భారీ బ‌డ్జెట్‌తో కాంతార 2… షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..

రిషబ్ శెట్టి స్వ‌యం దర్శ‌క‌త్వంలో తెరకెక్కిన మూవీ ‘‘కాంతార’’. గత సంవత్సరం రిలీజ్ అయిన ఈ సినిమా సెన్షేనల్ హిట్ అయ్యింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లో భారీ విజయం సాధించింది. కేవలం 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాంతార ఇంతటి విజయం సాధించడంతో పార్ట్ 2గా కాంతార ప్రీక్వెల్ రాబోతుందని గతంలోనే ప్రకటించాడు రిషబ్ శెట్టి.

కాగా, కాంతార 2 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ఇటీవలే పూర్తయినట్టు, స్క్రిప్ట్ మొత్తం లాక్ చేసినట్లు సమాచారం. తాజాగా, కాంతార 2 సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాన్ని నవంబర్ 27న నిర్వహించబోతున్నట్టు, షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో జరగనున్నట్టు తెలుస్తుంది. అలాగే కాంతార 2 కొన్ని వందల ఏళ్ళ క్రితం జరిగిన పంజుర్లి దైవ కథతో పీరియాడిక్ సినిమాగా ఉండబోతుందని సమాచారం.

ఇక కాంతార సినిమాకు 25 కోట్ల బడ్జెట్ పెట్టగా.. ఇప్పుడు కాంతార 2కి ఏకంగా 100 కోట్లు పెట్టి హోంబేలె ఫిలిమ్స్ గ్రాండ్ గా నిర్మిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాని ఓ ముఖ్య పాత్ర కోసం తీసుకున్నట్టు సమాచారం. కాంతార 2 కోసం రిషబ్ శెట్టి చాలా రీసర్చ్ చేశాడని, ఈ సినిమా మొదటి పార్ట్ కంటే పెద్ద హిట్ అవుతుందని కన్నడ పరిశ్రమలోని రిషబ్ సన్నిహితులు చెప్తున్నారు. దీంతో కాంతార 2 ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అభిమానులు ఈ సినిమాని త్వరగా మొదలుపెట్టాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement