Sunday, April 28, 2024

పుష్ప లో కన్నడ సీనియర్ నటుడు..అఫీషియల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అలాగే ఫస్ట్ సింగిల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో జాలి రెడ్డి అనే పాత్రలో ప్రముఖ కన్నడ నటుడు ధనుంజయ్ నటిస్తున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అందుకు సంబంధించి పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ధనుంజయ్ పోస్టర్ ను చూస్తుంటే ఇది ఒక నెగిటివ్ రోల్ అని అనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement