Saturday, April 27, 2024

ఇంస్టాగ్రామ్ లో వారం కూడా ఉండనిచ్చేలా లేరు!! -కంగనా

బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం ఏదో ఒక విషయంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూ ఉంటారు. అయితే ఇటీవల ఆమె అకౌంట్ ను ట్విట్టర్ శాశ్వతంగా నిషేధం విధించగా….ఇప్పుడు ఇంస్టాగ్రామ్ కూడా ఆమె పోస్టులను నియంత్రిస్తోంది. తనకు కరోనా సోకిందన్న విషయాన్ని చెబుతూ ఆమె చేసిన ఓ పోస్ట్ ను ఇంస్టాగ్రామ్ తొలగించింది. ఈ విషయాన్ని స్వయంగా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో కంగన చెప్పుకొచ్చింది. ఇంస్టా కు వచ్చి రెండు రోజులు అయింది…కానీ ఇక్కడ కూడా వారం కంటే ఎక్కువగా ఉండనిచ్చేలా లేరంటూ కామెంట్ చేసింది.

కరోనా వైరస్ చిన్న ఫ్లూ మాత్రమే అనవసరంగా అతిథిగా చేసి చూపిస్తున్నారు. ఎవరూ భయపడకండి..అంతా కలిసి పోరాడాలి. అంటూ డిలీట్ చేసిన పోస్టులో చెప్పింది. అయితే కరోనా కారణంగా దేశమంతా అల్లకల్లోలంగా మారితే.. చిన్న ఫ్లూ అని ఎలా అంటావ్ అని ఆమె పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అది అలా వివాదంగా మారుతుండటటం తో ఇంస్టాగ్రామ్ ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement