Friday, May 17, 2024

OTTలోకి కంగనారనౌత్‌ తేజాస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

బాలీవుడ్ హీరోయిన్ కంగనారనౌత్‌ నటించిన మూవీ తేజాస్. ఈ యాక్షన్‌ థ్రిల్లర్ అక్టోబర్‌ 27న గ్రాండ్‌గా విడుదలైంది. ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ZEE5లో జనవరి 5న 2024 ప్రీమియర్ కానుంది.

రొన్నీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమాలో అన్షుల్ చౌహాన్‌, వరుణ్ మిత్ర ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. కంగ‌నార‌నౌత్ ప్రస్తుతం ఎమ‌ర్జెన్సీ లో నటిస్తోంది. ఈ మూవీలో కంగ‌నార‌నౌత్ ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో శ్రేయాస్ తల్పడే, భూమికా చావ్లా ఇత‌ర న‌టీన‌టులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. హోం బ్యాన‌ర్ మ‌ణి క‌ర్ణిక ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై రేణు పిట్టి, కంగ‌నార‌నౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కంగనా రనౌత్‌ మరోవైపు హిందీ, తమిళ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement