Thursday, May 2, 2024

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది!!

నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ కొత్త సినిమాని అనౌన్స్ మెంట్ వచ్చేసింది. నందమూరి కళ్యాణ్ రామ్ తన 20వ సినిమాని కె.వి.గుహన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాకు #NKR20 వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. అలాగే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. గతంలో కె.వి.గుహన్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ 118 సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కళ్యాణ్ రామ్ ప్రస్తుతం విశిష్ట్ దర్శకత్వంలో బింబిసార సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement