Thursday, May 2, 2024

షూటింగ్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ రామ్ ‘‘డెవిల్’’

టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నందమూరి కళ్యాణ్‌రామ్. ఎప్పటికప్పుడు కొత్త కథలు, జానర్‌లతో ప్రయోగాలు చేస్తుంటాడు. కాగా, రీసెంట్ గా ‘బింబాసార’ సినిమాతో బిగ్ హిట్ అందుకున్న ఈ హోరో ప్రస్తుతం ‘డెవిల్’ అనే సినిమా చేస్తున్నాడు. “ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్” అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కతున్న ఈ సినిమాలో గూఢచారిగా కనిపించనున్నాడు కళ్యాణ్ రామ్. నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా కనిపించనుంది.

500 మంది ఫైటర్స్ పాల్గొన్న ఓ భారీ ఫైట్‌ను ఇటీవలే చిత్రీకరించారు. అయితే, ప్రస్తుతం షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని ప్రకటించారుమేకర్స్. ఈ పీరియాడికల్ డ్రామాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. “డెవిల్” సినిమా కళ్యాణ్ రామ్ మొదటి పాన్-ఇండియన్ ప్రాజెక్ట్, దీనిని తెలుగు, హిందీ, తమిళం మరియు కన్నడ భాషలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement