Thursday, May 2, 2024

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ ?

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభించి చాలా ఏళ్లు అవుతున్నా 1,2 హిట్లు తప్ప సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ఇటీవల ఎంత మంచి వాడవురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా సక్సెస్ సాధించలేకపోయాడు. ఆ తర్వాత ఇప్పటివరకు తన తర్వాత సినిమాను ప్రకటించలేదు. కానీ తన కొత్త ప్రాజెక్టును ఎప్పుడో పట్టాలెక్కించాడు. ఈ ప్రాజెక్టు కళ్యాణ్ రామ్ కెరీర్లోనే విశేషమైన ప్రాజెక్ట్ అని తెలుస్తోంది.

గతేడాది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ ఒక్క విషయం కూడా ఈ సినిమా నుంచి బయటికి రాలేదు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు చిత్రయూనిట్. నందమూరి తారకరామారావు పుట్టిన రోజు మే 28న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారట. చిత్ర దర్శకుడు, నటీనటులు, టెక్నీషియన్స్ ఇలా పూర్తి వివరాలను ఆ రోజే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను సొంత బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement