Saturday, May 4, 2024

హార్డ్ వ‌ర్కౌట్స్ చేస్తోన్న.. జ్యోతిక‌

పెళ్లి..పిల్లలు త‌ర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది న‌టి జ్యోతిక‌.దాంతో జ్యోతికకి మంచి కమ్ బ్యాక్ దక్కింది. ఆమె ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తున్న విషయం తెల్సిందే. ఇంట్రెస్టింగ్ కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్న జ్యోతిక వరుసగా సక్సెస్ లను దక్కించుకుంది. ఈ సమయంలోనే జ్యోతిక తన ఫిజిక్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.జ్యోతిక వయసు ప్రస్తుతం ఇంటర్నెట్ అనుసారం 44 సంవత్సరాలు. సాధారణంగా ఈ వయసులో హీరోయిన్స్ గా ఆఫర్లు రావడం అనేది చాలా తక్కువ… సౌత్ లో ఈ వయసు వచ్చే వరకు హీరోయిన్ గా కంటిన్యూ అవ్వడం దాదాపు అసాధ్యం కానీ జ్యోతిక మాత్రం ఇంకా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న విషయం తెల్సిందే. తన సినిమాల కోసం జ్యోతిక చేస్తున్న వర్కౌట్స్ షాకింగ్ గా ఉన్నాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఒక వీడియో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. సింగిల్ హ్యాండ్ పై బ్యాలన్స్ చేయడం తో పాటు హీరోలకు సైతం సాధ్యం కాని కొన్ని ఫీట్స్ ను చేస్తూ అబ్బుర పర్చుతోంది. బాబోయ్ అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత కష్టం ఏ సినిమా కోసం అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.. మీరు ఈ స్థాయిలో వర్కౌట్స్ చేస్తే కొత్త హీరోయిన్స్ ఫిజిక్ విషయంలో సిగ్గుతో తల దించుకుంటారేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement