Saturday, April 27, 2024

అదరగొడుతున్న జ్వాలా రెడ్డి సాంగ్

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం సినిమా సీటిమార్. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆంధ్ర మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా గోపిచంద్… తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా కనిపించబోతున్నారు. ఏప్రిల్ 2న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలకు, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా సిటిమార్ లోని జ్వాలా రెడ్డి సాంగ్ రికార్డు స్థాయిలో లైక్స్, వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది. యూట్యూబ్ లో 100k లైక్స్, టెన్ ప్లస్ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్నట్లు చిత్రబృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ఈ పాటను శంకర్ బాబు, మంగ్లీ పాడగా…మణిశర్మ మంచి సంగీతం అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement