Sunday, May 19, 2024

కొడుకుతో హైదరాబాద్ రోడ్లపై ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ రోడ్ల పై కొడుకు తో కలిసి షికార్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన రెండవ కొడుకు భార్గవ్ రామ్ ను బైక్ మీద కూర్చోపెట్టుకుని హైదరాబాద్ రోడ్లపై ఎన్టీఆర్ కనిపించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ ఎప్పుడూ బయట పెద్దగా కనిపించరు. కానీ ఇప్పుడు బయటకు రావడంతో ఆ పిక్ చూసి ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత కొరటాల శివతో 30వ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement