Thursday, May 2, 2024

హైదరాబాద్‌లో ఎన్టీఆర్30 ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ చేస్తున్న ప్రాజెక్ట్ ఎన్టీఆర్30. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కొన్ని వారాల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కాగా, మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్30 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్ బ్లాక్‌లు షూట్ చేశారు మేకర్స్.

ముందుగా అనుకున్న సమయానికే ఫస్ట్ షెడ్యూల్ చక్కగా ముగించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండ ఔట్‌పుట్‌ ​​పట్ల కూడా టీమ్‌ సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో తదుపరి షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ల సమక్షంలో ఈ షెడ్యూల్‌లో టాకీ భాగం చిత్రీకరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement