Monday, May 6, 2024

IPL | పంజాబ్​ ఢమాల్.. శిఖర్​ ధవన్​ ఒంటరి పోరాటం!

సన్​ రైజర్స్​ హైదరాబాద్​తో ఇవ్వాల ఉప్పల్​ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్​లో పంజాబ్​ సూపర్​ కింగ్స్​ ఢమాల్​ అంది. ఏమాత్రం పోరాట పటిమ చూపకుండానే ఫటాఫట్​ వికెట్లు కోల్పోతూ అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇందులో ప్రభుసిమ్రాన్​ సింగ్​ (0), మాథ్యూ (1), జితేశ్​ శర్మ (4), శామ్​ కరన్​ (22), సిఖిందర్​ రజా (5), శారుఖ్​ ఖాన్​ (4), హర్​ప్రీత్​ (1), రాహుల్​ చాహర్​ (0), నాథన్​ (0) పరుగులు చేశారు.

ఇక ఓపెనర్​గా వచ్చిన శిఖర్​ ధవన్​ 99 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. ఒంటరి పోరాటంతో కాస్త స్కోరు బోర్డు కదిలింది. కాగా, నిర్ధేశిత ఓవర్లలో పంజాబ్​ కింగ్స్​ టోటల్​ స్కోరు 143 పరుగులు కాగా, హైదరాబాద్​ టార్గెట్​ 144పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్​లో కీలక వికెట్లు తీసిన వారిలో.. మయాంక్​ మర్కండే 4,  మార్కస్​ జాన్సన్​ 2, ఉమ్రాన్​ మాలిక్​ 2, భువనేశ్వర్​ 1 వికెట్​ పడగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement