Tuesday, May 21, 2024

జోరుగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్ర‌మోష‌న్స్.. USలో నవీన్ పోలిశెట్టి స్టాండ్-అప్ టూర్‌..

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. ఇప్పటి వ‌ర‌కు రిలీజ్ అయిన పోస్ట‌ర్, టీజర్ వీడియోల‌తో ఈ మూవీ మంచి బజ్ క్రియేట్ చేసింది. కాగా, మూవీ వచ్చే వారం విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, నవీన్ పొలిశెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ నగరాల్లో తిరుగుతూ సినిమాను దూకుడుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా నవీన్ పోలిశెట్టి స్టాండ్-అప్ కామెడీ టూర్‌కి సానుకూల స్పందన వచ్చింది.

కాగా, ఇప్పుడు USAలో అడుగుపెట్ట‌బోతున్నాడు న‌వీన్.. USAలో అతని స్టాండ్-అప్ టూర్ సెప్టెంబర్ 6న డల్లాస్‌లో ప్రారంభమవుతుంది. అతను డ‌ల్లాస్ తో మొద‌లు పెట్టి అప్పుడు అట్లాంటా, బే ఏరియా, సీటెల్, వర్జీనియా చివరకు చికాగో వంటి నగరాలకు వెళ్తాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement