Friday, May 3, 2024

ఫస్ట్ వీకెండ్‌లో అదరగొట్టిన ‘జాతి రత్నాలు’

2021లో టాలీవుడ్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ నమోదైంది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ‘జాతిరత్నాలు’ సంచలన విజయం సాధించింది. శివరాత్రి కానుకగా ఈనెల 11న విడుదలైన ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసింది. లాంగ్ వీకెండ్‌ను ఫుల్‌గా క్యాష్ చేసేసుకుంది. మొత్తం రూ.12 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా.. తొలి వీకెండ్‌లోనే రూ.20 కోట్ల షేర్ వసూలు చేసి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సోమవారం కూడా చాలా చోట్ల ఈ మూవీ మంచి వసూళ్లను సాధిస్తుండటం విశేషం. కొన్ని ప్రాంతాల్లో అయితే పోటీగా విడుదలైన ‘గాలి సంపత్’ను తీసేసి ‘జాతి రత్నాలు’ మూవీని ప్రదర్శిస్తున్నారు.

తొలి వీకెండ్‌లో ఏరియాల వారీగా కలెక్షన్‌ల వివరాలు:

నైజాం: రూ.7.07 కోట్లు
సీడెడ్: రూ.2.8 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ.2.31 కోట్లు
నెల్లూరు: రూ.59 లక్షలు
కృష్ణా: రూ.1.07 కోట్లు
గుంటూరు: రూ.1.31 కోట్లు
వైజాగ్: రూ.96 లక్షలు
ఈస్ట్: రూ.97 లక్షలు
వెస్ట్: రూ.97 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ.61 లక్షలు
ఓవర్సీస్: రూ.3.31 కోట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement