Sunday, May 19, 2024

JANVI LOVE :లవ్ సింబల్ ఎవరి కోసం జాన్వీ

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో అమ్మ‌డు గ్రీన్ క‌ల‌ర్ ల‌వ్ సింబ‌ల్ టాప్ ధ‌రించింది. టాప్ ని మ్యాచ్ చేస్తే అదే రంగులో ఔట్ ఫిట్ లో క‌నిపించింది. అమ్మ‌డి రంగుని..రూపాన్ని ఈ గ్రీన్ క‌ల‌ర్ ఔట్ ఫిట్ మ‌రింత అందంగా ఫోక‌స్ చేస్తుంది.

ముఖానికి లైట్ మ్యాక‌ప్..పెదాల‌కు పూసిన లిప్ స్టిక్..హెయిర్ స్టైల్ అన్నింటా జాన్వీ మార్క్ క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇ న్ స్టాలో వైర‌ల్ గా మారింది. జాన్వీ అభిమానులు అమ్మ‌డి అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్లు చేస్తున్నారు. బ్యూటీలో మామ్ నే మించిపోతుందా? అంటూ పోస్ట్ లు పెడుతు న్నారు.
ఇక జాన్వీ కెరీర్ గురించి చెప్పేదేముంది. జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ స‌హా టాలీవుడ్ లోనూ బిజీ అవుతోంది. ఎన్టీఆర్ తో న‌టిస్తోన్న దేవ‌ర త‌ర్వాత జాన్వీ రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంద‌ని అంచ‌నాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement