Wednesday, May 1, 2024

క‌నుల విందుగా ఆదిపురుష్.. జై శ్రీరామ్ సాంగ్

బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకు రానుంది. తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్ పై రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేయబోతుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ మూవీలో స్టార్ హీరో ప్రభాస్ తొలిసారిగా రాముడిగా కనిపించనుండగా.. సీతగా కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. ఇందులో సన్నీ సింగ్ హనుమంతుడిగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి జైశ్రీరామ్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. జైశ్రీరామ్ అనే మహిమాన్విత మంత్ర నామాన్ని ఓ రేంజ్ లో ప్లాన్ చేసిన మొదటి సాంగ్ నుంచి ఇప్పుడు ఫుల్ వెర్షన్ బయటకి వచ్చింది. తాజాగా విడుదలైన ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, అజయ్ అతుల్ సంగీతం ప్రభాస్ ప్రెజెన్స్ ఓంరౌత్ విజన్ తో ఈ సాంగ్ సెన్సేషనల్ హిట్ అవ్వడం ఖాయం అని చెప్పొచ్చు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకోవడమే కాదు.. సినిమా ఏరేంజ్ లో ఉండబోతుందో చెప్పకనే చెప్పింది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement