Sunday, May 19, 2024

HIGH COURT – ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగం కిందకే బీకాం కోర్సు

అమరావతి . బీకాం కోర్సు.. ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగం కిందకే వస్తుందని తేల్చిచెప్పింది. దీని పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు స్పష్టతనిచ్చింది. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టు కు పురపాలక శాఖ 2019లో నోటిఫికేషన్ జారీ చేíసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల కు బీకాం చదివిన వారూ దరఖాస్తు చేయగా వారిని అధికారులు రాతపరీక్షకు అనుమతించారు. అయితే సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో బీకాం కోర్సు ఆర్ట్స్ హ్యుమానిటీస్ విభాగం కిందకు రాదని పోస్టుకు ఈ కోర్సుల విద్యార్థులు అర్హులు కారని అధికారులు తిరస్కరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగం కిందే బీకాం కోర్సును రాష్ట్రంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు బీకాంను బోధిస్తున్నాయని హైకోర్టు గుర్తు చేసింది. బీకాం ఆర్ట్స్ విభాగం కిందకు రాదనేందుకు ఆధారాలేవీ అధికారులు సమర్పించలేదని హైకోర్టు వెల్లడించింది. కామర్స్ కోర్సు ఆర్ట్స్ కిందకే వస్తుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సమాచార హక్కు చట్టం కింద తమకు సమాచారం ఇచ్చిందని వివరించింది… దీంతో వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులు పరీక్షకు హాజరైన విద్యార్ధులకు ఈ తీర్పుతో ఊరట లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement