Friday, October 4, 2024

నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై.. బండ్ల గ‌ణేశ్

రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ట నిర్మాత‌..న‌టుడు బండ్ల గ‌ణేశ్. సోషల్ మీడియాలో కాంట్రవర్సీ ట్వీట్లు.. సినిమా ఈవెంట్స్ లో అదిరిపోయే స్పీచ్ లు .. ఊహించని విధంగా రాజకీయ ఇంటర్వ్యూలతో.. భాగా వైరల్ అయ్యారు బండ్ల్ గణేష్. పలుఅంశాలపై, సినిమాలపై పోస్టులు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు నటుడిగా, నిర్మాతగా ఎన్నో హిట్స్ కొట్టిన బండ్లన్న ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలో తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ సీనీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం కర్నాటక ఎలక్షన్స్ హడావిడి నడుస్తోంది. కాంగ్రెస్ భారీ మెజారిటీతో అక్కడ గెలుపొందింది. అయితే ఈ రిజల్ట్ కు ముందే బండ్ల గణేష్ తన ట్విట్టర్ లో.. నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం అంటూ ట్వీట్ చేశారు. నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తా. బానిసత్వానికి బాయ్ బాయ్, నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై. రాజకీయాలంటే నిజాయితీ, రాజకీయాలంటే నీతి, రాజకీయాలంటే కష్టం, రాజకీయాలంటే పౌరుషం, రాజకీయాలంటే శ్రమ, రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా అని వరుసగా ట్విట్టర్ బాణాలు వదిలారు బండ్గ గణేష్. మ‌రి ఏ పార్టీలో చేరుతాడ‌నే విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement