Thursday, May 2, 2024

ప్రేమదేశపు యువరాణి ఐటెం పాట

YouTube video

యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ ప్రేమదేశపు యువరాణి’ . ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ నిర్మిస్తున్నారు. సాయి సునీల్‌ నిమ్మల దర్శకుడు. ఈ చిత్రంలోని ‘మసకతడి’ అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో యామిన్‌ మాట్లాడుతూ ” ప్రేక్షకుల సమక్షంలో పాటను విడుదల చేయడం, వారినుంచి చక్కని స్పందన రావడం చక్కని అనుభూతి కలిగించింది. దర్శకుడి ఆలోచనకు ధన్యవాదాలు ” అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ”ఎమోషనల్‌గా సాగే లవ్‌స్టోరీ ఇది. కొత్తగా పబ్లిసిటీ- చేస్తేనే చిన్న సినిమాలు జనాల్లోకి వెళతాయి. అంతా కొత్తవాళ్లం ఓ మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అని అన్నారు.

ఈ చిత్రంలో మెహబూబ్‌ బాషా, హరికృష్ణ, యోగి కద్రి, రఘు, సునీత, మనోహర్‌, పవన్‌ ముత్యాల, రాజారెడ్డి, సందీప్‌, స్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపీనాయుడు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్‌ దేవరకొండ, సంగీతం: అజయ్‌ పట్నాయక్‌, పాటలు: కాసర్ల శ్యామ్‌, సాయి సునీల్‌ నిమ్మల, భాను-కృష

Advertisement

తాజా వార్తలు

Advertisement