Thursday, May 16, 2024

మే 31 ‘సర్కారు వారి’ టీజర్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా వేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా సర్కారు వారి పాట సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న యువ నటి స్వప్నిక సోషల్ మీడియాలో నెటిజన్స్ తో ముచ్చటించారు. ఆ సమయంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

దుబాయ్ లో ప్లాన్ చేసిన ఫైట్ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలెట్ గా నిలుస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. అలానే మే 31న టీజర్ ఉండొచ్చేమో అంటూ రెండు సార్లు చెప్పి చెప్పినట్టే హింట్ ఇచ్చారు. అలాగే పాటలు కూడా చాలా బాగా వచ్చాయన్నారు. అంతేకాకుండా మహేష్ బాబు పుట్టిన రోజు నాడు ఫస్ట్ లుక్ కచ్చితంగా ఉంటుందని ఆమె ప్రకటించారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement