Thursday, April 25, 2024

ఆర్ఆర్ఆర్ కన్నడ రైట్స్ వారికే !!

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో వైపు ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన లుక్స్, టీజర్లు సినిమాపై మరింత అంచనాలను పెంచాయి. పాన్ ఇండియా చిత్రం గా తెరకెక్కుతున్న సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో భాషల్లో రిలీజ్ కానుంది.ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడామొద‌లైంది.

అయితే క‌ర్ణాట‌క‌లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ రైట్స్ ను కేజీఎఫ్ నిర్మాణ సంస్థ‌ హంబుల్ మూవీస్ ద‌క్కించుకుంద‌ని మొదట ప్రచారం జరగగా… తాజాగా వారాహి చ‌ల‌నచిత్రం సంస్థ త‌రుపున సాయి కొర్ర‌పాటి, ఏషియ‌న్ సునీల్ భారీ రేటు వెచ్చించి ద‌క్కించుకున్నార‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement