Thursday, May 2, 2024

శంకర్ రామ్ చరణ్ సినిమాపై పెరుగుతున్న అంచనాలు – హీరోయిన్ ఎవరో తెలుసా ?

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ సంగతి తెలిసిందే. ఇక సినిమా అనౌన్స్ చేసిన అప్పటి నుంచి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఆ తరువాత ఈ సినిమానే చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో మరో ప్రముఖ హీరో విలన్ గా కనిపించనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు చర్చలు జరిగినట్లు సమాచారం. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ కు ఈ సినిమా సంగీత బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement