Friday, April 26, 2024

ఎండింగ్ లో షూటింగ్ – ఖిలాడి అప్డేట్

లాంగ్ గ్యాప్ తరువాత క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మాస్ మహారాజా రవి తేజ. ఈ సినిమా హిట్ తో రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. క్రాక్ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవటమే కాకుండా అత్యధికంగా వసూళ్లను సాధించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రవితేజ రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మరోవైపు అర్జున్, అనసూయ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను మే 28న విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ షూటింగ్ స్పీడ్ పెంచింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరింది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement