Sunday, May 5, 2024

డీజే టిల్లు 2 రిలీజ్ అప్పుడేనా..?

విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘డీజే టిల్లు’. సిద్దు కి జోడీగా నెహా శెట్టి హీరోయిన్ గా నటించింది. అయితే, గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా, ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో డీజె టిల్లు 2 తెరకెక్కున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇక, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీకి రామ్ మిరియాల సంగీతం అందిస్తుండగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మింస్తున్నారు. ఇక మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన డీజే టిల్లు 2 మూవీని ఆగష్టు 11న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నట్లు టాలీవుడ్ టాక్.

అయితే.. ఇదే రోజున ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ ‘భోళా శంకర్’ మూవీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. మరి ప్రస్తుతం బజ్ ప్రచారం అవుతున్న న్యూస్ కరెక్ట్ అయితే బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ మూవీతో టిల్లు క్లాష్ అవడం ఖాయం. అయితే దీని పై ఆ మూవీ యూనిట్ నుండి అఫీషియల్ గా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement