Sunday, May 19, 2024

Indian 2 | ఇండియ‌న్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్

కమల్ హాసన్, శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘భారతీయుడు’. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఇండియ‌న్ 2 సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండ‌గా.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాని జూన్‌లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. ఇక‌ ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెంట్ మూవీస్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement