Friday, May 3, 2024

జ‌య జ‌య జ‌య‌హే రీమేక్ లో.. ఫాతిమా స‌నా షేక్

సినిమా బాగుండాలే కానీ భాష‌తో ప‌ని లేదు. అందుకే క‌న్న‌డ‌..మ‌ల‌యాళ చిత్రాలకి ఆద‌ర‌ణ పెరుగుతోంది. కాగా ఈ మ‌ధ్య మలయాళ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. మలయాళం నుంచి ఏదైనా సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందంటే క్షణాల్లో జనాల్లోకి వెళ్లిపోతుంది. గంటల్లోనే లక్షల్లో వ్యూస్‌ వచ్చేస్తున్నాయి.కాగా రెండు నెలల క్రితం ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన జయ జయ జయ జయహే సినిమా రిలీజైన గంటల్లోనే లక్షల్లో వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఇక గతేడాది అక్టోబర్‌ నెలలో రిలీజైన ఈ సినిమా రూ.50 కోట్లు వసూళ్‌ చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. కాగా ఇప్పుడీ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నారు. బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన ఫాతిమా సనా షేక్‌ దంగల్‌తో హీరోయిన్‌గా మారింది. తొలి సినిమానే తిరుగులేని విజయం సాధించడంతో ఆమె క్రేజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. కాగా ఫాతిమా ఇప్పుడు జయ జయ జయ జయహే సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తుంది. ఈ సినిమాను అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌ నిర్మిస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన విపిన్‌ దాసే రీమేక్‌ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందట‌. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement