Monday, April 29, 2024

వార్నర్ కు హైదరాబాద్ ఎంత ఇష్టమో ఈ పోస్ట్ చూస్తే తెలిసిపోతుంది!!

క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినప్పటికీ ఇండియాలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఐపీఎల్లో సన్ రైజర్స్ టీం వార్నర్ సారథ్యంలోనే ట్రోఫీని కూడా గెలుచుకుంది. ఇప్పటికి కూడా సన్ రైజర్స్ టీం లోనే కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే వార్నర్ సౌత్ ఇండియన్ సినిమా పాటలకు సంబంధించి అదిరిపోయే స్టెప్స్ వేస్తూ ఆ వీడియోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు వార్నర్. అయితే తాజాగా వార్నర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నా రెండో ఇల్లు ఇంకా భారతదేశంలో నాకు అన్నింటికన్నా నాకు నచ్చే ప్రదేశం హైదరాబాద్’ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement