Monday, April 29, 2024

ఏకగ్రీవం చేస్తే ఓకే…లేదంటే పోటీ తప్పదు – మంచు విష్ణు

మా అసోసియేషన్ ఎన్నికల్లో ఈసారి మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మా అసోసియేషన్ ఎన్నికలపై బహిరంగ లేఖను విడుదల చేశారు విష్ణు. 2015 లోనే దాసరి నారాయణ రావు, మురళీమోహన్ మా అధ్యక్షుడిగా ఉండమని అడిగితే తన తండ్రి ఆ వయసులో ఆ బాధ్యతలు వద్దని చెప్పారని… అలాగే అప్పట్లోనే మా అసోసియేషన్ సొంత భవన నిర్మాణం కోసం 25 శాతం నిధులు ఇస్తామని హామీ ఇచ్చామని.. కానీ ఇప్పుడు తాజాగా మా కుటుంబమంతా కలిసి కార్యాలయాన్ని కట్టిస్తుందని హామి ఇచ్చాడు.

మా ఆవిర్భావం తదనంతర పరిణామాలు గడిచిన పాతికేళ్లలో మోహన్బాబు చేసిన సేవలను నాలుగు పేజీల లేఖలో మంచు విష్ణు తెలియజేశారు. అలాగే ఇండస్ట్రీ లో ఉన్నటువంటి పెద్దలు కృష్ణంరాజు, సత్యనారాయణ, మోహన్ బాబు, బాలకృష్ణ ,చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, జయసుధ, రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాసరావు అందరూ కూర్చొని మా కుటుంబాన్ని నడపడానికి ఏకగ్రీవంగా ఒకరిని ఎన్నుకోవాలని వారి నిర్ణయాన్ని గౌరవించి తాను కూడా పోటీ నుండి తప్పుకుంటానని చెప్పుకొచ్చారు. ఏకగ్రీవం లేని పక్షంలో పోటీలో నిలబడతానని క్లారిటీ ఇచ్చారు విష్ణు.

Advertisement

తాజా వార్తలు

Advertisement