Thursday, May 2, 2024

Hi Nanna Trailer | ‘హాయ్‌ నాన్న’ ట్రైలర్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా ‘హాయ్ నాన్న’. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక‌, ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫ‌స్ట్ సింగిల్, సెకండ్ సింగిల్‌ల‌ను లాంఛ్ చేయగా.. ప్రేక్ష‌కుల నుంచి విప‌రీత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

కూతురిపై ప్రేమ, కుటుంబం నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీలో నాని కూతురి పాత్ర కూడా చాలా కీలకం. బేబీ కియారా ఆ పాత్రలో కనిపించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్.

YouTube video

ఈ సినిమాని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక హేషామ్ అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు సంగీతం అందించ‌గా… డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement