Sunday, April 28, 2024

Nani : హాయ్ నాన్న ప్ర‌మోష‌న్స్ షురూ…నానీ, మృణాల్ ల హంగామా..

నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కె. ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాన్ ఇండియన్ మూవీ హాయ్ నాన్న. యువ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర చేస్తుండగా ఇతర పాత్రల్లో జయరాం, అంగద్ బేడీ నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహబ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
ఇక డిసెంబర్ 7న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను షురూ చేసారు. అందులో భాగంగా హీరో నాని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇద్దరూ కలిసి ప్రత్యేకంగా మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ ఫోటోలు రిలీజ్ చేసిన మేకర్స్, అతి త్వరలో ఫుల్ ఇంటర్వ్యూ ప్రసారం అవుతుందని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement