Friday, May 3, 2024

పెళ్లి చేసుకున్న సంజన

హీరోయిన్ సంజన గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. బుజ్జిగాడు సినిమాలో త్రిష సోదరిగా సంజన నటించింది. దీంతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటించింది. అలాగే బాలీవుడ్, కన్నడ సినిమాలలో కూడా నటించింది. కాగా ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంజన బెయిల్ పైన బయటకు వచ్చింది. ఇక తాజాగా కర్ణాటక కు చెందిన డాక్టర్ పాషాను పెళ్లి చేసుకుంది.

ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించింది. ఈ వివాహం అతి తక్కువ మంది బంధువులు స్నేహితుల మధ్య జరిగింది. అయితే పెళ్లి తో పాటు కొత్తగా డిజిటల్ రంగంలోకి కూడా అడుగుపెడుతోంది ఈ అమ్మడు. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలియజేసింది సంజన.

Advertisement

తాజా వార్తలు

Advertisement