Friday, April 26, 2024

ప్రస్తుతం ఉన్నవి మూడే!! కృతి క్లారిటీ

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ కృతి శెట్టి. ఈ సినిమాతో నటన పరంగా తానేంటో నిరూపించుకున్న కృతి టాలీవుడ్ కోలీవుడ్ లో వరుస అవకాశాలను పొందుతోంది. అయితే కృతి చేతిలో ఉన్న సినిమాల పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా తాజాగా కృతి శెట్టి మాట్లాడుతూ… ప్రస్తుతం తన చేతిలో ఉన్నవి మూడు సినిమాలే నని… అందులో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాతో పాటు సుధీర్ బాబు, రామ్ పోతినేని సినిమాలలో మాత్రమే నటిస్తున్నానని స్పష్టం చేసింది. అయితే తమిళంలో తాను ఏ సినిమా కూడా చేయడం లేదని ఒకవేళ సినిమా చేస్తే కచ్చితంగా తెలియజేస్తానని చెప్పుకొచ్చింది. ఈ మూడు సినిమాలు పూర్తి అయిన తర్వాత వేరే ప్రాజెక్టుల గురించి ఆలోచన చేస్తానని క్లారిటీ ఇచ్చింది కృతి శెట్టి.

Advertisement

తాజా వార్తలు

Advertisement