Saturday, May 4, 2024

గోవా బ్యూటీనే నా క్రష్ – విశ్వక్ సేన్

ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నూమాదాస్, హిట్ వంటి చిత్రాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో విశ్వక్ సేన్. అలాగే యూత్ తో కూడా మంచి మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే అంతటి ఫాలోయింగ్ వున్న విశ్వక్ సేన్ కు ఓ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట. ఆమె మరెవరో కాదు గోవా బ్యూటీ ఇలియానా.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విశ్వక్…చిన్నప్పటి నుంచి ఇలియానా అంటే చాలా ఇస్తామట. ఆమె పోస్టర్ లు ఎక్కడ కనిపించినా వెంటనే ఇంటికి తెచ్చుకునే వాడిని అని తెలిపారు. ఆమె ఫోటో షూట్ లు ఏవి మిస్ కాలేదని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నా మనసు మారలేదని, ఇలియానాపై అభిమానం అలాగే ఉందని అన్నారు. నా క్రష్ ఎప్పటికీ ఇలియానానే అని అన్నారు. విశ్వక్ సేన్ ప్రస్తుతం పాగల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement