Sunday, April 28, 2024

Hero Surya Teja Ale: అన్ని పాత్రలు సమానంగా ఉంటాయి…

సూర్య తేజ ఏలే భరతనాట్యం చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. కెవిఆర్‌ మహేంద్ర దర్శకుడు. పాయల్‌ సరాఫ్‌ నిర్మించిన్న ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సూర్య తేజ ఏలే విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

నిజానికి నాకు సినీ హీరో కావాలని అనుకోలేదు. దర్శకత్వం చేయాలనే ఆసక్తివుండేది. కాలేజ్‌ పూర్తయిన తరవాత రచనపై ఆసక్తి ఏర్పడింది. కథలు రాయడం, నెరేట్‌ చేయడం.. ఇలా స్ట్రగులింగ్‌ లో వున్న సమయంలో హితేష్‌ గారికి నేను చెప్పిన కథ నచ్చిం ది. కథ రాసినప్పుడు నేను హీరో గా చేస్తానని అనుకోలేదు.
కెవిఆర్‌ మహేంద్ర గారితో పరిచ యం వుంది. నేను ఆయనకు ఒక డ్రాప్ట్‌n స్క్రిప్ట్‌ ఇచ్చాను. అది ఆయన కు నచ్చింది. నా నమ్మకం నిజమైయింది. ఆయనకి నచ్చింది.
భరతనాట్యం ఫిక్షనల్‌ స్టొరీ. కానీ రియల్‌ లైఫ్‌ తో రిలేట్‌ చేసుకునేలా వుంటు-ంది. ఒక మనిషి షార్ట్‌ కట్‌లో వెళితే ఏం జరుగుతుందనేది ఈ సినిమా పాయింట్‌. పర్శనల్‌గా ఫీలైన స్ట్రగుల్స్‌ ని కామికల్‌ గా చేసి రాసింది. కమర్షియల్‌గా చాలా మంచి ఎంటర్‌ -టైనర్‌.
ఈ కథకు భరతనాట్యం పర్ఫెక్ట్‌ -టైటిల్‌. అది ఎలా అనేది సినిమా చూస్తున్నపుడు తెలుస్తుంది.
వినయ్‌ వర్మ గారి దగ్గర యాక్టింగ్‌ కోర్స్‌ చేశాను. ఏడాది పాటు- అన్నపూర్ణలో ఫిల్మ్‌ కోర్స్‌ చేశాను. మా నాన్న గారు (ధని ఏలే) సినీ పరిశ్రమలో పాతికేళ్ళుగా పబ్లిసిటీ- డిజైనర్‌ గా పని చేస్తున్నారు. నేను పెయిటింగ్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌, మాస్టర్స్‌ చేశాను. సినిమా -టైటిల్స్‌ రాస్తుంటా ను. డిజైనింగ్‌, ఎడిటింగ్‌లో అనుభవం వుంది. కోవిడ్‌ తర్వాత రైటింగ్‌ లోకి వచ్చాను.
ఇది లవ్‌ స్టొరీ కాదు. అన్ని పాత్రలు సమానంగా వుంటాయి. హీరోయిన్‌ పాత్ర మాత్రం కథలో కీలక పాత్ర పోషిస్తుంది.
కాసర్ల శ్యామ్ , అనంత శ్రీరామ్ , భాస్కర భట్ల అద్భుతమైన పాటలు రాశారు. అనంత శ్రీరామ్‌ గారు చాలా ఫన్‌ పర్శన్‌. కథ వింటూ మాతో ట్రావెల్‌ అయ్యారు. భాస్కర భట్ల చాలా నాలెడ్జ్‌ షేర్‌ చేశారు. ఈ ముగ్గురితో బ్యూటీ-ఫుల్‌ జర్నీ. పాటలన్నీ ప్రేక్షకులని ఆకట్టు-కుంటాయి.
నాకు వ్యక్తిగతంగా కృష్ణ వంశీ, త్రివిక్రమ్ అంటే ఇష్టం. అలాగే చాలా మంది నుంచి స్ఫూర్తి పొందాను.

Advertisement

తాజా వార్తలు

Advertisement